20/10/2024
*ఈ ఊర్లు భద్రాచలంలో ఉన్నాయి ఈ ఊర్లు పై భలే జోకులు ఉంటాయి*
🙏🙏🙏🙏🙏🙏
ఈ ఊర్లు మధ్య ప్రయాణం,
ఎలావుంటుందో ఉహించుకుని నవ్వుకుందాం.
తంతానికి ఒక టికెట్ ఇవ్వండి.
తన్నించుకుంటానికి రెండు ఇవ్వండి.
సార్ చిల్లర ఇవ్వలేదు.
తంతానికి వెళ్ళేవాడికే ఇవ్వలేదు.నువ్వు తన్నిం చుకుంటానికి కదా!
చివరిదాకా వస్తావు కదా!
కంగారుపడకు.
వెనుకసీట్లో అయన : ఏరాబ్బాయి! ఈ మధ్య తంతానికి రావట్లేదు.
లేదు బాబాయ్! తన్నించు కుంటానికి వెళ్లిపోతున్నా బాబాయ్.
అక్కడ ఆర్డర్లు వస్తున్నాయి.
సరేరా! తన్నించు కుంటా అలవాటు అయిపోయి, తంత మాటే మరిచిపోయావు,
ఇంతలోడ్రైవర్ : తంతానికి ఎవరైనా వున్నారా?
కండక్టర్ : ఒక్కరే తంతానికి, అందరు తన్నించుకుంటానికే.
బాబూ తన్నించుకుంటానికి అందరు టికెట్లు చేత్తో పట్టుకోండి.
అప్పుడే మెలుకువ వచ్చిన పాసింజర్ : తంతానికి దిగాలి ఇప్పుడు ఎలా?
కండెక్టర్ విసుగ్గా : ఇంకో ఇరవై ఇచ్చి తన్నించు కుంటానికి దిగు
బస్ దిగుతూ బాబాయ్ పిన్నిని తీసుకుని ఒకసారి తన్నించుకుంటానికి రండి. 🤣🤣🤣🤣🤣