Krupasanamminstres

Krupasanamminstres Your Prayer request 9966048208
Your offering 192210100121629 ifsc ANDB0001922

24/01/2026

యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము నీత్రోవలను నాకు తేటపరచుము.
కీర్తన 24:4.............................................. భక్తుడు ఎందుకు ఇలా ప్రార్థన చేశాడు,, మనకిష్టమైన భక్తి జీవితం ఫలభరితంగా మారదు దేవునికి మన వలన తృప్తి కలుగదు,, ఈ రొండు జరగాలంటే దేవుని ఆరాధించే ప్రతీ వారు ఆయన మార్గాలు ఆయన త్రోవలు కనుగొనాలి,, అదే ఆయన చిత్తం జరిగించడం,, దేవుని ఆరాధిస్తూ మీ దారిలో ఉన్నారా దేవుని దారిలో ఉన్నారా,,... నా యేసు పరిచర్యలు సయ్యద్ తిమోతి యడ్లపాడు పల్నాడు జిల్లా 8639505361. ప్రభువు కృప మీకు తోడుగా ఉండును గాక.

22/01/2026

కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు.
రోమా 8:1..............................................మారుమనసు విశ్వాసం బాప్తీస్మం ద్వారా యేసు క్రీస్తు నందు మనకు ప్రవేశం దొరికి సమస్త శిక్షలనుండి విడిపించబడతాము,, బాప్తీస్మం తర్వాత ఆయన యందుండి సరైన భక్తి జీవితం లేకపోతె ఆయన ద్వారా శిక్షించ బడతాం,, ఇంకా మారక పోతే ఆయన నుండి త్రోసి వేయబడి బ్రష్ట మనసుకు అప్పజెప్ప బడతాము,, ఇప్పుడు ఆయన యందు ఉన్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలి,,... నా యేసు పరిచర్యలు సయ్యద్ తిమోతి యడ్లపాడు పల్నాడు జిల్లా 8639505361. ప్రభువు కృప మీకు తోడుగా ఉండును గాక.

22/01/2026

నా ప్రియురాలా, నీవు అధికసుందరివి నీయందు కళంకమేమియు లేదు.
పరమ గీతం 4:7............................................. ఒక వరుడు తన ప్రేయసిని ఇలా మెచ్చుకొనునట్లు కళంకం లేని తన సంఘమును యేసు వారు మెచ్చు కుంటారు,, సంఘం గురించే పైన వాక్యం ప్రవచనాత్మకంగా రాయబడింది,, మన భక్తి జీవితంలో లోపాలు బలహీనతలు మనం సరిచేసుకున్నప్పుడే మన దేవుడు మనలను మెచ్చుకుంటారు,,... నా యేసు పరిచర్యలు సయ్యద్ తిమోతి యడ్లపాడు పల్నాడు జిల్లా 8639505361. ప్రభువు కృప మీకు తోడుగా ఉండును గాక.

21/01/2026

ఆయనయందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై యున్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసికొనును.
1యోహాను3:3............................................. బైబిల్ ఎన్ని సార్లు చదివినా, బయట ఎంత పేరు సంపాదించుకున్న ,, ఎన్ని సన్మానాలు ఎన్ని ఆధిక్యతలు పొందుకున్నా ,, ఎన్నో ఆదాయాల మార్గాలు ఉన్నా ఎంతో మందికి సహాయం చేస్తున్న,, ఈ వాక్య సారాంశం తెలియకపోతే ఆయన వలె పవిత్రంగా మారక పోతే,, ప్రసంగి గ్రంథంలో చాలా సార్లు చెప్పినట్లు అంతా వ్యర్ధం వ్యర్ధం వ్యర్ధం అని ఓ రోజు తల పట్టుకొని కొట్టు కొని ఏడ్వాలీ,, అబద్ధాలు చెప్పేవారు పవిత్రులు ఎలా అవుతారు,,,... నా యేసు పరిచర్యలు సయ్యద్ తిమోతి యడ్లపాడు పల్నాడు జిల్లా 8639505361. ప్రభువు కృప మీకు తోడుగా ఉండును గాక.

20/01/2026

మీరీలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క మహిమను పొందవలెనని, ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను.
2థెస్సలోనిక 2:14............................................. దేవుడు తన మహిమ నిచ్చి మనలను మహిమ పరచే వాడై ఉన్నాడు ఆ మహిమలో భూమి మీద మనకు కావలసిన సంపదలు ఉన్నాయి,, ఒక వేళ భూమి మీద సంపదలు ఏమి లేకపోయినా ఆయన మహిమ మనం పొంది ఉంటే చాలు,, సద్భక్తి తో ఉన్న వారు మాత్రమే ఆయన మహిమ పొందగలరు,, అబద్ధాలు మోసాలు మాయలు స్వార్ధం అపవిత్రపు మాటలు దేవుని మహిమను అడ్డుకుంటాయి,,,... నా యేసు పరిచర్యలు సయ్యద్ తిమోతి యడ్లపాడు పల్నాడు జిల్లా 8639505361. ప్రభువు కృప మీకు తోడుగా ఉండును గాక.

19/01/2026

పరలోక రాజ్యమర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది గాని వారికి అనుగ్రహింప బడలేదు., మత్తయి 13:11............................................. పరలోక రాజ్యం గురించి కొంత మంది గ్రహించేటట్లు కొంత మంది గ్రహించినట్లు దేవుడు ఎందుకు చేశాడు, దేవుని పక్షపాతమా కాదు,, అందరూ రక్షణ పొందాలనే ఆయన ఉద్దేశాన్ని కొందరు అంగీకరిస్తుంటే కొందరు తృణీకరిస్తున్నారు,,త్రిణీకరించే వారికి ఆయన మర్మాలు ఎందుకు చెబుతాడు,, విరిగి నలిగిన హృదయంతో వేడుకొనే వారికి ఆయన సంగతులు విసిదపరుస్తాడు,,... నా యేసు పరిచర్యలు సయ్యద్ తిమోతి యడ్లపాడు పల్నాడు జిల్లా 8639505361. ప్రభువు కృప మీకు తోడుగా ఉండును గాక.

18/01/2026

మీరు క్రీస్తుతోకూడ లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండియున్నాడు., కొలసి3:1............... ............................ ..... యేసు క్రీస్తు వారిని నమ్మిన నాటినుండి ఆయన కృపా కనికరములు ఆయన ప్రభావ మహిమలు శక్తి సంపన్నతలు ఆయన గుణాల విలువలు తెలుసుకోవడానికి ప్రతీ రోజు సాధన చేయాలి,, ఈ లోక సంబంధమైన దీవెనల కోసం ఆరాటం కలిగిన వారు క్రీస్తు వారిని సంపూర్ణంగా కనుగొనలేరు,,... నా యేసు పరిచర్యలు సయ్యద్ తిమోతి యడ్లపాడు పల్నాడు జిల్లా 8639505361. ప్రభువు కృప మీకు తోడుగా ఉండును గాక.

17/01/2026

ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను.,
యోహాను 2:5.............................................. దేవుడు చెప్పింది చేయడం అమృతం,, జీవితం అయినా సేవ అయినా మన ఇష్టం కాకుండా దేవుని చెప్పింది మాత్రమే చేయగలగాలి,, నేను దేవుని కోసమే సమాజం కోసమే ఇదంతా చేస్తున్నాను అని చెప్పే వారందరిని ఇది చేయమని నేను మీకు చెప్పానా అని దేవుడు అడుగుతాడు,, మీరు చేస్తున్నది జాగ్రత్తగా ఆలోచించి చేయండి,,... నా యేసు పరిచర్యలు సయ్యద్ తిమోతి యడ్లపాడు పల్నాడు జిల్లా 8639505361. ప్రభువు కృప మీకు తోడుగా ఉండును గాక.

16/01/2026

దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయ ములో అనుకొందురు.వారు చెడిపోయినవారు అసహ్యకార్యములుచేయుదురు.మేలుచేయు వాడొకడును లేడు.
కీర్తన 14:1.............................................. దేవుడు లేడు అనుకునే వారు బుద్ధి హీనులై చెడ్డ కార్యాలు చేస్తారు,, దేవుడు ఉన్నాడు అని తెలిసి చెడ్డ కార్యాలు చేసే వారిని ఏమనాలి?? తెలియక చేస్తే తక్కువ దెబ్బలైతే తెలిసి చేస్తే ఎక్కువ దెబ్బలు తినాలి,, తెలియని వారికంటే తెలిసి చేసే వారే చాలా ప్రమాద కారులు,,... నా యేసు పరిచర్యలు సయ్యద్ తిమోతి యడ్లపాడు పల్నాడు జిల్లా 8639505361. ప్రభువు కృప మీకు తోడుగా ఉండును గాక.

15/01/2026

ఎదుటివాని మేలు ఓర్చలేనివానితో కలిసి భోజనము చేయకుము వాని రుచిగల పదార్థముల నాశింపకుము.,
సామెతలు23:6.............................................. కలసి భోజనం చేయడం లో జీవిత ఆనంద రహస్యం ఉంది,, ఎదుటి వానికి మేలు చేసే గుణం ఉన్న వారితో భోజనం చేయడం జీవితంలో ఓ భాగ్యమే,, ఎదుటి వారి మేలు ఓర్చలేని వానితో భోజనం చేయడం బాత్రూమ్ లో డైనింగ్ టేబుల్ వేసుకున్నట్లు ఉంటుంది,,,.. నా యేసు పరిచర్యలు సయ్యద్ తిమోతి యడ్లపాడు పల్నాడు జిల్లా 8639505361. ప్రభువు కృప మీకు తోడుగా ఉండును గాక.

14/01/2026

యేసు ఫిలిప్పూ, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు?,,
యోహాను 14:9............................................. యేసు ప్రభువు వారు ఫిలిప్పుని మాత్రమే అడిగారు అనుకుంటాము,, ఇంత కాలము మీతో ఉన్న ప్రభువుని మీరు గుర్తుపట్టారా చూసుకున్నారా ?? దేవుడు మీకిచ్చిన సంపదను చూసి మురిసి పోతున్నారు గాని మీతో ఉన్న ప్రభువుని చూసి పరవశం చెందిన క్షణాలు దినాలు ఎన్ని??నేనెళ్ళప్పుడు నా ప్రభువుని చూచు చుంటిని,, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదలచబడను,,... నా యేసు పరిచర్యలు సయ్యద్ తిమోతి యడ్లపాడు పల్నాడు జిల్లా 8639505361. ప్రభువు కృప మీకు తోడుగా ఉండును గాక.

13/01/2026

దుష్టులకు విజయము కొద్దికాలముండునుభక్తిహీనులకు సంతోషము ఒక నిమిషమాత్రముండును., యేబు 20:4..............................................మీ పై విజయమొందుతున్న దుష్టుల గురించి భయపడకండి దిగులు పడకండి,, వారి విజయం కొద్దికాలమే,, మీకు శాశ్వత విజయం కలుగుతుంది,, మీ తల ఎత్తబడుతుంది,,... నా యేసు పరిచర్యలు సయ్యద్ తిమోతి యడ్లపాడు పల్నాడు జిల్లా 8639505361. ప్రభువు కృప మీకు తోడుగా ఉండును గాక.

Address

Jayalakchmi Muveland
Chilakaluripet
522233

Alerts

Be the first to know and let us send you an email when Krupasanamminstres posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share